ఎమ్మెల్యే సుమన్ ఏం చేశారు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 25: చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ టిఆర్ఎస్ పార్టీకి తన నెల జీతాన్ని విరాళాన్ని అందించారు. నెల జీతం రూ.2,50,000 చెక్కును సుమన్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అందించారు. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు ఇకపై సొంత స్థలాల్లో, సొంత భవనాల్లో కొలువుదీరనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ నెల 24న పార్టీ ఆఫీసులకు శంకుస్థాపనలు జరిగాయి. ఈ నేపథ్యంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ టీఆర్ఎస్ పార్టీకి తనవంతు విరాళంగా తన నెలజీతాన్ని అందించారు. పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం ముందుకొచ్చిన సుమన్ ను ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు.