JMS News Today

For Complete News

తనదైన శైలిలో..ప్రజలకు చేరువయ్యేలా…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూన్ 30: కరీంనగర్ డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ (ఎస్పీఓస్) గా ఇటీవలే పదవి బాధ్యతలు చేపట్టిన వై.వెంకటేశ్వర్లు పోస్టల్ శాఖకు చెందిన అన్ని రకాల సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా తనదైన శైలీలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అటు సిబ్బందికీ తర్పీదును ఇస్తూనే.. ఇటు ప్రజలకు అందించే పోస్టల్ శాఖ సేవలపై కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. భాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పోస్టల్ శాఖ సేవలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం కరీంనగర్ ప్రెస్ భవన్ లో అధికారులు, సిబ్బందికి పార్సల్ ఆపరేషన్లు, బిజినెస్ పార్సల్ స్కీములపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్బంగా వేంకటేశ్వర్లు మాట్లాడారు. కేంద్ర తపాలా శాఖ ఇటీవల ప్రవేశపెట్టిన పార్సెల్, బిజినెస్ పార్సెల్ స్కీంతోపాటు ఇతర సర్వీసులైన సేవింగ్ బ్యాంకు, రికరింగ్ డిపాజిట్, మంత్లీ ఇన్కమ్ స్కీం, టైం డిపాజిట్, సుకన్య సమృద్ధి అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్రాలు, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, తపాలా జీవిత భీమా పథకం, గ్రామీణ జీవిత భీమా పథకం, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు, ఇతర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు.
పోస్టాఫీస్ సేవలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు సంస్థ అభివృద్ధి కోసం కూడా అందరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కరీంనగర్ ఏఎస్పీ సునీల్ కుమార్, పోస్టల్ ఇన్స్పెక్టర్లు చంద్ర మోహన్, శ్రవణ్, దయానంద్, పోస్ట్ మాస్టర్ ఫజులుర్ రెహమాన్, ఎస్పీఎంలు, పోస్టుమాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.