ప్రజలకు వివరించాలి…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, డిసెంబర్ 24: ప్రజలతో సత్సంబంధాలను ఏర్పరచుకోవాలని, అప్పుడే లక్ష్యాలను సాధించవచ్చని కరీంనగర్ పోస్టల్ సూపరిండెంట్ డి . సత్తయ్య బ్రాంచి పోస్టు మాస్టర్లకు పిలుపునిచ్చారు. పోస్టల్ శాఖలో ఉన్న సేవలపై, పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. శుక్రవారం గంగాధర మండల కేంద్రంలో నార్త్ సబ్ డివిజన్ లోని బ్రాంచి పోస్టు మాస్టర్ (బిపిఎం)లకు నిర్వహించిన గ్రామీణ తపాల జీవిత భీమా (ఆర్పీఎల్ఐ) పథకాల మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తపాల శాఖలో అందించే అన్ని సేవలపై ప్రజలకు కూలంకషంగా వివరించాలని, ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే ఇన్సూరెన్స్ పథకాలపై వివరించాలని సూచించారు. అలాగే గ్రామ ప్రజాప్రతినిధులతో కూడా టచ్ ఉండాలని, వారికి కూడా పోస్టల్ శాఖ సేవలపై వివరించాలని, గ్రామ సభలు జరిగినప్పుడు అందులో పాల్గొని తమ సేవలపై వివరించాలని సూచించారు. తపాల శాఖ సేవలపై ప్రజల్లోకి తీసుకెళ్ళి మీ డివిజన్ అగ్రభాగాన నిలిచేలా అందరు కృషి చేయాలని కోరారు. ఈ మేళాలో ఎఎస్పీ సునీల్ కుమార్, ఇన్స్పెక్టర్ పోస్టు చంద్రమోహన్, ఐపిపిబి బ్రాంచి మేనేజర్ చంద్రకాంత్, గంగాధర ఇన్చార్జి ఎస్పీఎం ప్రదీప్, బోయినపల్లి ఎస్పీఎం మహేష్, రామడుగు ఎస్పీఎం అజ్మత్ అలీ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మెయిల్ ఓవర్ సీర్ మల్లేశం, నార్త్ సబ్ డివిజన్లకు చెందిన బిపిఎంలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఐపిపిబిలో ఉత్తమ సేవలందించిన పలువురు బిపిఎంలకు బహుమతులను అందజేశారు.