ఆ పథకాలపై విస్తృత ప్రచారం….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
గంగాధర, ఆగస్టు 11: పోస్టల్ ఇన్సూరెన్స్ పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని కరీంనగర్ పోస్టల్ సూపరింటెండెంట్ డి.సత్తయ్య బ్రాంచి పోస్టు మాస్టర్లకు పిలుపునిచ్చారు. బుధవారం గంగాధర మండల కేంద్రంలో నార్త్ డివిజన్ బ్రాంచి పోస్టు మాస్టర్ (బిపిఎం)లకు నిర్వహించిన తపాలా జీవిత భీమా (పిఎల్ఐ), గ్రామీణ తపాలా జీవిత భీమా (ఆర్పీఎల్ఐ) పథకాల మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తపాల శాఖలో అందించే అన్ని సేవలపై ప్రజలకు కూలంకషంగా వివరించాలని, ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే ఇన్సూరెన్స్ పథకాలపై వివరించాలని సూచించారు. గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలతో సత్స సంబంధాలు మెరుగుపర్చుకోవాలని సూచించారు. అలాగే గ్రామ ప్రజాప్రతినిధులతో కూడా టచ్ లో ఉండాలని, వారికి కూడా పోస్టల్ శాఖ సేవలపై వివరించాలని, గ్రామ సభలు జరిగినప్పుడు అందులో పాల్గొని తమ సేవలపై వివరించాలని, అప్పుడే మీ మీ లక్ష్యాలు (టార్గెట్)లను సునాయసంగా చేరుకోవచ్చని తెలిపారు. తపాల శాఖ సేవలపై ప్రజల్లోకి తీసుకెళ్ళి మీ డివిజన్ అగ్రభాగాన నిలిచేలా అందరు కృషి చేయాలని కోరారు. అంతకుముందు బిపిఎంలతో ఒక్కొక్కరిగా తమ బ్రాంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేళాలో ఎఎస్పీ సునీల్, ఇన్స్పెక్టర్ పోస్టు చంద్రమోహన్, గంగాధర ఎస్పీఎం ప్రవీణ్, మెయిల్ ఓవర్సీల్ లు రాజు, మల్లేశం, నార్త్ డివిజన్ లకు చెందిన బిపిఎంలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎక్కువగా ఇన్సూరెన్స్ పాలసీలు చేసిన బిపిఎంలు ఎస్పీ, ఎఎస్పీ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. మొదటి బహుమతి ముంజంపల్లి బిపిఎం శ్రీనివాస్, ద్వితీయ బహుమతి వెదురుగట్ట బిపిఎం లక్ష్మణ్, తృతీయ బహుమతి తడగొండ బిపిఎం కిరణ్ లు అందుకున్నారు.