ఆశ్చర్యపోయిన హరీష్…!
1 min read
సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన ఓ పెళ్లికి హాజరైన ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆశ్చర్యపోయారు. నూతన దంపతులను ఆశీర్వదించేందుకు స్టేజి మీదకు వెళ్లగానే పెళ్లి పెద్దలు పెళ్లికి వచ్చిన అతిథులకు హరీష్ తో పండ్ల మొక్కలను ఇప్పించారు. దీంతో ఆశ్చర్యపోయిన హరీశ్ ప్రజల్లో వచ్చిన చైతన్యానికి సంతోషపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పెళ్లి వేడుకకు హాజరైన అతిథులకు జ్ఞాపికలను ఇవ్వడం చూస్తుంటామని, కానీ ఇక్కడ మొక్కలను ఇవ్వడం చూస్తే సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి ఆరాధకులకు ఎప్పుడూ మంచే జరుగుతుందని, మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, మీ పెళ్లి ఒక స్ఫూర్తి అని, మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పెళ్లికూతురు తండ్రికి హరిష్ అభినందనలు తెలిపారు. ఈ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు.