ప్రమాణం చేసిన తెలంగాణ ఎంపీలు
1 min read
ఢిల్లీ: రెండో రోజు మంగళవారం కూడా పార్లమెంట్ లో ఎంపీల ప్రమాణ స్వీకారాల పర్వం కొనసాగింది. రెండో రోజు తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, త్రిపుర, పశ్చిమబెంగాల్, ఉత్తరాకాండ్ తదితర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసారు. తెలంగాణ నుంచి ఎన్నికయిన ఎంపీలు బండి ;సంజయ్ కుమార్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు వెంకటేష్ నేతకాని, బీ బీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, డాక్టర్ రంజిత్ రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ, మన్నె శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పసునూరి దయాకర్, మాలోతు కవిత, నామా నాగేశ్వర్ రావు లతో ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ప్రమాణం చేయించారు. వీరిలో సంజయ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, రాములు, నాగేశ్వర్ రావు, కవిత, వెంకట్ రెడ్డి, వెంకటేష్ తెలుగులో ప్రమాణం చేయగా, అర్వింద్, రంజిత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు ఇంగ్లీషులో, బీ బీ పాటిల్ హిందీలో, అసదుద్దీన్ ఒవైసీ ఉర్దూలో ప్రమాణం చేసారు. ఇదిలా ఉండగా, పంజాబ్ లోని సంగ్రూర్ నుంచి విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవత్ మన్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం విశేషం.