కాపాడే ప్రయత్నంలో కానరానిలోకాలకు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, నవంబర్ 5: తహశీల్దార్ విజయా రెడ్డి ని కాపాడే ప్రయత్నంలో తీవ్ర గాయాలపాలైన ఆమె డ్రైవర్ గురునాథం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. సూర్యాపేటకు చెందిన గురునాథం గత ఎనిమిదేళ్లుగా విజయారెడ్డి వద్దే డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆమెకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న గురునాథానికి భార్య, ఒక బిడ్డ ఉండగా, ప్రస్తుతం భార్య గర్భవతి. కాపాడే ప్రయత్నంలో తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడటం అందరిని కలచివేసింది. ఈ ఘటన మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.