తహశీల్దార్, వీఆర్వోలపై వేటు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
పెద్దపల్లి, జూన్ 23: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మందల రాజారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో తహశీల్దార్ వేణుగోపాల్, వీఆర్వో గురుమూర్తిలపై వేటు పడింది. ఈ ఇద్దరిని సస్పెండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కాల్వశ్రీరాంపూర్ తహశీల్దార్ గా సునీతను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.