బాబు నిర్ణయం ఎలా వుంటుందో….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 25: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను ముగించుకుని మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. జూన్ 19న ఆయన యూరప్ పర్యటనకు కుటుంబంతో కలిసి వెళ్లారు. అయితే.. ఆయన విదేశీ టూర్ లో ఉండగానే టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోవడంతో స్వదేశానికి వచ్చాక ఆయన పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగానే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ్యులు బీజేపీలో చేరడం, టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరడం, తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, బోడె జనార్థన్ కూడా కమలం పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడంతో చంద్రబాబు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారన్న అన్న ఆసక్తి అటు టీడీపీతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లో కూడా నెలకొంది. పార్టీ జంపింగ్‌ల సంగతి పక్కన పెడితే.. ప్రజావేదిక కూల్చివేయాలంటూ సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారనే అంశం అత్యంత ఉత్కంఠగా మారింది. ఇదే ప్రజావేదికను తమకు కేటాయించాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసిన సంగతి కూడా తెలిసిందే. అయితే.. ఈ నిర్మాణమే అక్రమమంటూ కూల్చివేయాలని వైసీపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమం లో బాబు వైఖరి ఏలా ఉండబోతోంది అనేేేది దానిపై ఉత్కంఠ నెలకొంది.