JMS News Today

For Complete News

సర్కార్ తీరు ఇదేనా …?

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

అమరావతి, జూన్ 25:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను ఆ పార్టీ నేతలు ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఆ పార్టీ ముఖ్యనేతలు మంగళవారం సమావేశమయ్యారు. శాంతిభద్రత విషయంలో వైసీపీ అనుసరిస్తున్న విధానాలను తప్పుపట్టారు. టీడీపీ కార్యకర్తలపై భౌతికదాడులు, ఆస్తుల ధ్వంసం చేస్తున్న ఘటనలు రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు తార్కాణంగా పేర్కొన్నారు. ఇదే సమయంలో చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించడంపైనా చర్చించారు. ప్రభుత్వం ప్రాణాలతో చెలగాటం ఆడే చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ప్రజాధనంతో నిర్మించిన భవనాలను కూల్చేయడం సరికాదని నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విత్తనాల కొరతను పరిష్కరించాలని టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *