JMS News Today

For Complete News

ఆరోగ్య శ్రీలో చేర్చండి…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 14: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు అంబటి జోజిరెడ్డి విమర్శించారు. టీడీపీ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం “కేసీఆర్ మేలుకో – పేదలను ఏలుకో” పేరిట పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్న కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కట్టడి చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు తీవ్రతరమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయకుండా ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి
వదిలేసిందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ సర్కార్ నిర్వాకం వల్లనే ప్రజలు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందపోవడం తోతప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తుండగా, ఇదే అదనుగా ప్రైవేటు ఆస్పతుల యాజమాన్యాలు అడ్డగోలుగా బిల్లులు వేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని తెలిపారు. లక్షల్లో బిల్లులు చెల్లించలేక పేదలు యాతన పడుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడమే శ్రేయస్కరమని పేర్కొన్నారు. పక్క రాష్ట్రంలో మాదిరిగా మన రాష్ట్రంలోనూ కరోనాను ఆరోగ్యశ్రీలో జాబితాలో
చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా కిట్లు,టెస్టులకు సంబంధించి ఆధునిక పరికరాలు అందు బాటులో ఉంచాలని, ప్రైవేటు ఆస్పత్రుల్లో బిల్లులు చెల్లించిన కరోనా బాధితులకు ప్రభుత్వం డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా ప్రభావం అన్నివర్గాల ప్రజలపై పడిందని, ముఖ్యంగా పేదల పరిస్థితి అత్యంత దయనీయం మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో పేద కుటుంబాలకు నెలకు 10వేల చొప్పున ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ దీక్షలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు వంచ శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ కమిటీ సభ్యులు సందెబోయిన రాజేశం,ఎస్సీ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు బోలుమల్ల సదానం దం,టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్లపల్లి రవీందర్, మీడియా సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, టీఎన్ఎస్వీ పార్లమెంట్ అధ్యక్షుడు ఎర్రవెల్లి రవీందర్, వాణిజ్య సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు ఎనిమిల్ల కిషన్, తెలుగు యువత రాష్ట్ర నాయకుడు రోడ్డ శ్రీధర్,  నాయకులు సాయిల్ల రాజమల్లయ్య, తాటికొండ శేఖర్, నరేందర్ దత్తు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *