కాషాయ కండువ కప్పుకున్న పెద్దిరెడ్డి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
డిల్లీ, జూన్ 27: కరీంనగర్ జిల్లా కు చెందిన టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి గురువారం డిల్లీ లో బిజెపి లో చేరారు. ఆయన తోపాటు చాడ సురేష్ రెడ్డి కాషాయ కండువ కప్పుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జిల్లా కు చెందిన జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో పెద్దిరెడ్డి బిజెపి లో చేరారు. కాగా, జిల్లా లో ఉన్న పెద్దిరెడ్డి అనుచరులు, అభిమానులు బిజెపి లో చేరే అవకాశాలున్నాయి.