పంతుళ్ళ ధర్నా
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 6: ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనర్ల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ రాష్ట్రోపాధ్యాయ సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు సుంకిశాల ప్రభాకర్ రావు, కటకం రమేష్ కొట్టే లక్ష్మణరావు తో పాటు పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.