అరెస్ట్ ను ఖండించిన ఉపాధ్యాయ సంఘాలు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జనవరి 3: ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన నిలబడి, ఉద్యోగ ఉపాధ్యాయులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి జాగరణ చేస్తున్న ఎంపీ బండి సంజయ్ కుమార్ ను అరెస్ట్ చేయడాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి. ఈ మేరకు ఆ సంఘాల నేతలు సంయుక్త పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు గొడ్డలిపెట్టుగా మారిన 317 జీవోను రద్దు చేయాలని, పార్లమెంట్ సభ్యులు తన పార్లమెంట్ కార్యాలయంలో జాగరణ కార్యక్రమం శాంతియుతంగా కోవిడ్ నిబంధనలతో తలపెట్టిన కార్యక్రమానికి భంగం కల్గిస్తూ యావత్ తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ఉద్యోగ ఉపాధ్యాయులను ఇబ్బందికి గురిచేసే విధంగా మహిళలని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించడం దారుణమని పేర్కొన్నారు. అలాగే కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా ప్రభుత్వం ముందస్తుగా ఏ ఉపాధ్యాయ సంఘంతో చర్చించలేదని, ఏ ఉపాధ్యాయ సంఘం విజ్ఞాపనలను ప్రభుత్వం పరిగణన లోకి తీసుకోలేదని, ఇది అసత్య ప్రచారమని, ప్రాథమిక ఉపాధ్యాయులకు, సంఘాలకు మధ్య చిచ్చు పెట్టే కుట్ర అని వివరించారు.
ప్రజాస్వామిక హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం తానే నిరంకుశంగా వ్యవహరిస్తూ నిరసనను తెలిపే ప్రాథమిక హక్కులను కూడా నిర్దాక్షిణ్యంగా కాలరాసిన 25నాటి అసెంబ్లీ ముట్టడి, ఈనాటి సంజయ్ దీక్షల భగ్నం అనేవి ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ప్రజా స్వామ్యంలో వివిధ రూపాలలో నిరసన చేయడం రాజ్యాంగ హక్కు అని, ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్న జీవో 317ను రద్దు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ప్రెసిడెన్సియల్ ఆర్డర్ ను అమలు చేసే క్రమంలో స్థానికత కొరకు లోకల్ క్యాండిడేట్ పేరాగ్రాప్ జోడించి 124 మరియు 317 జీవోలు సవరణలు చేసి అమలు పర్చాలని యుటిఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు ముల్కల కుమార్, కాట నర్సయ్య గౌడ్, టి.ఆర్.టి.ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుంకిశాల ప్రభాకర్ రావు, రెంటాల రమణా రెడ్డి, తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంబటి వేణు కుమార్, వీరమల్ల వెంకటర మణ రావు, డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజారెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అటుకుల శ్రీనివాస్ రెడ్డి, తూముల తిరుపతి, టిఎస్ టియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కంకణాల రాంరెడ్డి, దేశ రఘు కుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గాజుల రవీందర్, పింగిలీ రమేశ్ రెడ్డి, ఎస్ జిటియూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, శాంతి కిరణ్, టి పిటిఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు బండి పెళ్లి పరుశరాములు, రామచంద్రారెడ్డి, ఎస్.ఎల్.టిఏ అధ్యక్ష, కార్యదర్శులు స్తంభం కాడి గంగాధర్, ముత్తినేని శ్రీనివాస్, ఆర్.యుపిపి అధ్యక్ష, కార్యదర్శులు మడుపు శ్రీనివాస్ రెడ్డి, కాసారపు మహేశ్వర్
ఆ ప్రకటనలో కోరారు.