తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు….
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
డిల్లీ, ఆగస్టు 29: తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
సికింద్రాబాద్ నుండి ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పాంట్రీ కార్ భోగి లో మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
మిగతా బోగీలకు మంటలు చేరకముందే అప్రమత్తమైన అధికారులు ట్రైన్ నిలిపి మంటలు ఆర్పుతున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. బుధవారం ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరిన ట్రైన్ డిల్లీ సమీపంలోని బాలగడ్ వద్దకు చేరుకోగానే ఘటన జరిగింది. మొత్తానికి అధికారుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.