లోకసభలో తెలంగాణ సర్కార్ తీరును ఏకిపారేసిన ఎంపీలు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
న్యూఢిల్లీ, జూలై 3: మన ఎంపీలు పార్లమెంట్ లో తెలంగాణ సమస్యలపై గళం విప్పారు. శాసన సభలో మాట్లాడే అనుభవం ఉన్నఒకరు, ఎలాంటి అనుభవం లేని మరొకరు తెలంగాణ సర్కార్ తీరుపై ఏకిపారేశారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్, భాజపా ఎంపీలు లోక్‌సభ వేదికగా ప్రజా సమస్యలపై గళమెత్తారు. పోడు భూముల వివాద అంశాన్ని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లేవనెత్తగా.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల వ్యవహారాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రస్తావించారు. ఇటీవల అటవీ శాఖ అధికారిణి అనితపై జరిగిన దాడి సహా పోడు భూముల సమస్యలను రేవంత్ లోక్‌సభలో లేవనెత్తారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”దశాబ్దాలుగా ప్రభుత్వం, ఆదివాసీల మధ్య నలుగుతున్న భూ సమస్య పరిష్కారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే తెలంగాణలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తద్వారా శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. కాగజ్‌నగర్‌లోని కొత్త సార్సాల దాడి ఘటన తరహాలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లలోనూ మరో ఆటవిక దాడి జరిగింది. ఈ దాడిలో అటవీ సిబ్బంది గాయపడ్డారు. ఐదు లక్షల హెక్టార్ల భూముల విషయంలో సమస్య కొన్నేళ్లుగా సాగుతోంది. అడవిని పోడు చేసి ఆదివాసీలు జీవిస్తుండగా.. వారిని వెళ్లగొట్టేందుకు సర్కార్ ప్రయత్నిస్తోంది. ఐదో షెడ్యూల్లో ఉన్న సున్నితమైన ఈ సమస్య విషయంలో కేంద్ర అటవీ, హోంశాఖ మంత్రులు జోక్యం చేసుకొని తక్షణమే సమీక్ష జరపాలని కోరుతున్నా. గవర్నర్ ద్వారా నివేదిక తెప్పించుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా” అని అన్నారు. అలాగే అనేక ప్రాంతాల్లో అనేక సమస్యలతో ఇబ్బందులు కష్టాలు తోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చూశాం తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తనకు అనుకూలమైన అనుభవం లేని గ్లోబరినా సంస్థ కు అప్పగించడం వల్ల ఆత్మహత్య చేసుకున్నారు 9 లక్షల మంది విద్యార్థులు 3 లక్షల మంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ కావడం జరిగింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ నివేదిక సమర్పించింది తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకుండా కనీసం పరామర్శించకుండా నిర్లక్ష్యం వహించారు సంబంధిత ఘటనపై ఏ ఒక్కరి పై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పెద్ద పెద్ద వాళ్లు చనిపోతే పరామర్శించి ముఖ్యమంత్రికి 27 మంది విద్యార్థులు చనిపోతే కనీసం సమయం దొరకలేదు టిఆర్ఎస్ పార్టీ వల్ల రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగీస్తోంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.