JMS News Today

For Complete News

స్టేట్ కేబినెట్ నిర్ణయంతో….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, జూన్ 19: గత రెండ్రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టుగానే స్టేట్ కేబినెట్ డిసిషన్ తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఫలితంగా రేపటి నుంచి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొననున్నాయి. శనివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో లాక్ డౌన్ తో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేసుల సంఖ్య తగ్గిపోయిందని, పాజిటివిటీ శాతం గణనీయంగా పడిపోయిందని, కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని వైద్యశాఖ ఉన్నతాధికారులు కేబినెట్ కు నివేదించారు. వైద్యశాఖ అధికారులు అందించిన నివేదిక పరిశీలన, పోలీసులు, ఇతర ఉన్నతాధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మంత్రులతో ఈ విషయంపై సీఎం చర్చించారు. అనంతరం ఆదివారం నుంచి లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించారు. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. దీంతో రేపటి నుంచి సినిమా హాళ్లు, పబ్ లు, షాపింగ్ మాల్స్, వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరచుకోనున్నాయి. యథా విధిగా మెట్రో, బస్సు సర్వీసులు నడవనున్నాయి. అన్ని కేటగిరీల విద్యా సంస్థలు జూలై 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని, కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ప్రజలను స్టేట్ కేబినెట్ కోరింది. మొత్తం మీద లాక్ డౌన్ ఆంక్షలపై నెలకొన్న ఉత్కంఠకు కేబినెట్ తెరదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *