హెచ్-143కి టెంజు నేత గుడ్ బై
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఫిబ్రవరి 12: సంఘాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి తాకట్టు పెట్టిన హెచ్-143 జర్నలిస్ట్స్ యూనియన్ నాయకుల వైఖరి నచ్చనందునే ఆ సంఘానికి రాజీనామా చేసి, జర్నలిస్టుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న టీయుడబ్ల్యుజె (ఐజేయు)లో చేరినట్లు 143-సంఘం అనుబంధ సంస్థ టెంజు రాష్ట్ర ఉపాధ్యక్షుడు యు.రవీందర్ స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్ లోని శ్వేతా హోటల్ లో టీయుడబ్ల్యుజె (ఐజేయు) రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా ఐజెయు అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ సమక్షంలో రవీందర్ యూనియన్ సభ్యత్వం తీసుకున్నారు. రవీందర్ చేరికపై పలువురు టీయూడబ్ల్యూజే నాయకులు హర్షం వ్యక్తం చేశారు.