పరీక్షలా…ప్రమోటా…?
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 7: కరోనా కారణంగా తరచూ వాయిదా పడుతూ వస్తున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణపై చిక్కుముడి వీడటం లేదు. ఫలితంగా పది పరీక్షలపై అటు విద్యార్థుల్లో, ఇటు తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పది పరీక్షలపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. అదేందంటే ఎటువంటి గ్రేడింగ్ లు లేకుండా హాల్ టికెట్ పొందిన ప్రతి ఒక్క విద్యార్థిని ప్రమోట్ చేసే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్టు భోగట్టా. ఇందుకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ కూడా జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ తరహా నిర్ణయాన్ని ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం ప్రకటించగా, మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా 1969 సంవత్సరంలో ఇలాంటి ఉత్తర్వులు వెలువడ్డాయి. కార్పొరేట్ విద్యా సంస్థలు, కాలేజీలు రంగులతో మాయాజాలం చేయకుండా న్యాయ పరమైన ఏలాంటి చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేసి కేవలం ప్రమోట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా, విద్యార్థినీ విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ఈ తరహ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు తెలిపారు.