JMS News Today

For Complete News

మాటలు తూటాల్లా పేల్చుతూ….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హుజురాబాద్, అక్టోబర్ 22: హుజురాబాద్ ఎన్నికల సమయం సమీపిస్తున్నా కొద్దీ హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం వెడేక్కుతోంది. మాటలు తూటాల్లా పేల్చుతూ నేతలు ఓటర్లను అకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికార తెరాసతో పాటు బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పలు గ్రామాల్లో బిజెపి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజేందర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏడున్నర సంవత్సరాలుగా సెక్రటేరియట్ కి రాడు. రాలేదు అంటున్నారని, ఉన్న సచివాలయం కూలగొట్టారని దుయ్యబట్టారు. ధర్మానికి పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆత్మగౌరంతో బ్రతికే వ్యక్తి ఈటల రాజేందర్ అని పేర్కొన్నారు. బానిసలుగా ఉండాలని కేసిఆర్  కోరుకుంటారని విమర్శించారు.100 కోట్లు డోస్ ఇచ్చిన ఘనత నరేంద్రమోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వమని, ప్రతి గ్రామానికి కేంద్రం నిధులు పంపిస్తుందని వివరించారు. హుజూరాబాద్ ప్రజలు అంగట్లో గొర్రెలు కాదని కెసిఆర్ కి మీ పౌరుషం చూపించాలని కిషన్ రెడ్డి కోరారు. బిజెపి అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కెసిఆర్ అహంకారానికి బుద్ది చెప్పాలని ఓటర్లను కోరారు. మంత్రి హరీష్ లెక్క 6 ఫీట్లు లేకపోవచ్చు కానీ తెలివి లేదా? ఆయన అందరినీ గొర్రెలు అనుకుంటున్నారని, ఆయన ఇప్పుడు ఆర్థిక మంత్రి, నేను అప్పుడే ఆర్థిక మంత్రిని నాకు లెక్కల తెలవదా? పెట్రోలు మీద 36 శాతం రాష్ట్రం వసూలు చేస్తే, 29 శాతం కేంద్రం వసూలు చేస్తుందని వివరించారు. పెట్రోల్, డీజిల్ GST పరిధిలోకి తీసుకువస్తామని కేంద్రం అంటే వద్దు అని సంతకం పెట్టింది హరీష్ కాదా అని ప్రశ్నించారు. సొమ్ము కేంద్రానిదే, సోకు కెసిఆర్ ది అన్న చందంగా ఉందని ధ్వజమెత్తారు. ఉపాధిహామీ పనులు డబ్బులు 90శాతం కేంద్రం ఇస్తే, 10 శాతం రాష్ట్రం ఇస్తుందని, ఇదోక్కటే కాదు అన్ని పథకాల్లో కేంద్రం నిధులు ఇస్తుందని తెలిపారు. రాష్ట్రానికి చైతన్యాన్ని నింపిన ప్రాంతం హుజూరాబాద్ అని, కుట్రలు, కుతంత్రాలు, డబ్బులు, లిక్కర్ నమ్ముకునే వారు వారైతే, ప్రజలను నమ్ముకున్న వాడిని నేను అని అన్నారు. కెసిఆర్, హరీష్ బొమ్మ ఫ్లెక్సీ మీద ఉంటది గాలికి చినిగి పోతుంది. కానీ నా బొమ్మ ప్రజల హృదయాల్లో ఉందని తెలిపారు. బానిసత్వం బద్దలు కొట్టాలని తెలంగాణ ఎదురుచూస్తుందని, ఆత్మగౌరవ పోరాటం సిద్దమని తెలంగాణ అంటుందని రాజేందర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *