JMS News Today

For Complete News

కలెక్టర్ ఏమన్నారంటే….

1 min read

కరీంనగర్: ప్రభుత్వ ఉద్యోగులు హెల్మెట్ ధరించి కార్యాలయాలకు రావాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. అలాగే హెల్మెట్ ధరించి వస్తేనే పెట్రోల్ పోయాలని అన్నారు. రహదారులపై వాహనాలు జాగ్రత్తగా నడపాలని వాహనదారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా రోడ్డు కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. రహదారులపై ఉండే మూల మలుపుల వద్ద చెట్ల పొదలు లేకుండా చూడాలని, హెచ్చరికల బోర్డులు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాద రహిత జిల్లాగా మారడానికి అందరు కృషి చేయాలని కోరారు. సీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ -జగిత్యాల రహదారిలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రమాదాల నివారణకు పోలీసు పక్షాన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ ప్రమాదాలు తగ్గించేందుకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సమావేశంలో పోలీసు, రవాణా, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *