ఆ గ్రామంలో హృదయ విదారక ఘటన
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే. కామ్)
మహబూబ్ నగర్, జూన్ 23: జీవితాంతం తోడు నీడగా కలిసి ఉందామనుకున్నా ఓ ప్రేమ జంట మరణంలోనూ కలిసే తనవులు చాలించారు. ఈ హృదయ విదారక ఘటన మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ కొండ మండలం రాంపూర్ లో చోటుచేసుకుంది. మూడు నెలల కిందట ఇంట్లో నుంచి వెళ్లి పోయిన ప్రేమికులు సమీప గుట్టలో చెట్టుకు ఉరి వేసుకొని కుళ్ళిన స్థితిలో కనిపించారు. మహబూబ్ నగర్ జిల్లా రాంపురం గ్రామానికి చెందిన రవి (19) డిగ్రీ సెకండ్ ఇయర్, రాధిక (20) డిగ్రీ థర్డ్ ఇయర్ చవుతున్న వీరు ఒకరికొకరు ప్రేమిoచుకున్నారు. అయితే గత మార్చి 23 న కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలపడం, ఇందుకు కుటుంబ సభ్యులు ఒప్పకోకపోవడం లాంటి పరిణామాలతో ఇద్దరు ఇంట్లో నుoచి అదే రోజు హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే, మరుసటి రోజు 24 వ తేదీన కోయిల్ కొండ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా, వీరిపై మిస్సింగ్ కేసు కూడా పోలీసులు నమోదు చేసారు. ఈ క్రమంలో రాంకొండ సమీప గుట్టలో మేకల కాపరులు ఆత్మహత్య చేసుకుని కుళ్ళిపోయిన మృతదేహలని గుర్తించిన వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేయగా, రాంపురం గ్రామనికి చెందిన వారిగా గుర్తిoచారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. రాంపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.