JMS News Today

For Complete News

రెడ్ అలర్ట్…బీకేర్ పుల్….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్‌, సెప్టెంబర్ 27: గులాబ్‌ తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల అతిభారీ, భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు ప్రకటించింది. అలాగే మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ర్రాష్ట ప్రభుత్వం అప్రమత్తమై అధికారులను అలర్ట్ చేసింది. అటు రాష్ట్ర పోలీసు శాఖ కూడా ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించింది. లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని, నీటి ప్రవాహాలు దాటేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని పోలీసు అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *