ఆ మంత్రి ఏం చేశాడో తెలుసా…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 24: ఓ తెలంగాణ మంత్రి అందరి ప్రశంశలు అందుకున్నారు. ఆయన ఏం పనిచేసారు? ఆయనను ఎందుకు మెచ్చుకుంటున్నారు? అంటే నిజంగానే అయన చేసిన పని చాలా గొప్పది. వివరాల్లోకి వెళితే… ఓ అనాథ యువతికి తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి దంపతులు తల్లిదండ్రుల్లా మారి వివాహం జరిపించారు. బహుదూర్ పల్లిలోని గౌరీ అనాథ ఆశ్రమంలో పుష్ప అనే అమ్మాయి ఆశ్రయం పొందింది. ఆశ్రమంలోనే పుష్ప విద్యాబుద్ధులు నేర్చుకుంది. యుక్తవయస్సు రావడంతో ఆమెను విజయవాడకు చెందిన కిశోర్ అనే యువకుడికిచ్చి పెళ్లి చేశారు.ఈ పెళ్లికి మంత్రి మల్లారెడ్డి దంపతులు పెద్దమనసుతో ముందుకువచ్చి పుష్పకు తల్లిదండ్రుల స్థానంలో నిలిచి సమస్త లాంఛనాలు జరిపించారు. అంతేకాకుండా పుష్ప పేరుమీద రూ.2.35 లక్షలకు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి ఆ పత్రాలను కానుకగా అందించారు. ‘ఖర్చులకు ఉంచుకోండి’ అంటూ మరో పాతికవేల రూపాయలు ఇచ్చి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. తమ పెళ్లి జరగడానికి కారణమైన మంత్రి మల్లారెడ్డి దంపతులకు పుష్ప కృతజ్ఞతలు తెలుపుకుంది. మంత్రి దంపతులు చూపిన ఔదార్యానికి అందరూ హ్యాట్సాఫ్ అంటూ అభినందనలు తెలిపారు. ఈ మంత్రి లాగా అందరు ముందుకు వచ్చి నిరుపేద యువతులకు, అనాధలకు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.