జాతీయ జెండా ఎగరేయడం మరిచారు….!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హుస్నాబాద్, ఆగస్టు 15: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మరిచిన ఘటన హుస్నాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. హుస్నాబాద్ లోని అర్ అండ్ బి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో జెండా అవిష్కరణ కార్యక్రమాన్ని మరిచారు. ఈ కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవం జరపకపోవడం జాతిని, దేశాన్ని, మహనీయులను అవమానించనట్లేనని స్థానికులు వాపోయారు. అర్ అండ్ బి అధికారుల వైఖరికి నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో అర్ అండ్ బి కార్యాలయంలో జెండా అవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జెండా అవిష్కరణ చేయకపోవడం సిగ్గు చేటు, స్వాతంత్రం తీసుకోచ్చిన మహానీయులను, దేశాన్ని అవమానించడమేనని బిజెపి నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరయోగుల అనంతస్వామి, గుత్తికొండ విద్యాసాగర్, దొడ్డి శ్రీనివాస్, కవ్వ వేణుగోపాల్ రెడ్డి, సతీష్, కురుమెల్ల శ్రీనివాస్, శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.