వాట్సాప్ వదంతులపై పోలీసుల సీరియస్ …ఒకరి అరెస్ట్ , మరో 9 మంది బైన్ డోవర్
1 min read
పెద్దపల్లి : వాట్సాప్ గ్రూపులలో అసత్యపు వదంతులు పోస్ట్ చేసిన వారిపై రామగుండం కమిషనరేట్ పోలీసులు కొరడా జుళిపించారు. సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు పోలీసులు అసత్యపు వదంతులు పోస్ట్ చేసిన పలు ప్రాంతాలకు చెందిన ఒక అడ్మిన్ ను అరెస్ట్ చేయగా, 9 మందిని బైన్ డోవర్ చేశారు. గోదావరిఖనికి చెందిన అప్పాసి అజయ్ అరెస్ట్ చేసి రిమాండుకి పంపగా ,మంచిర్యాలకు చెందిన అన్నం రమేష్, బెల్లంపల్లికి చెందిన జవ్వాజి సత్యనారాయణ, గోదావరిఖనికి చెందిన పంజా శ్రీనివాస్, సొల్లు శ్రీనివాస్, బన్నె సతీష్ కుమార్, సొన్నాల నరేష్, వేజ్జిలపు నరేష్, బత్తుల రవి, బోగం విజయ్ అనే 9 మందిని బైన్ డోవర్ చేసారు. ఈ సందర్బంగా సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ ఏమాత్రం నిజం కానీ అసత్యపు వదంతులు ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ కఠినంగా వ్యవరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వచ్చిన సమాచారం సత్యమా, అసత్యమా నిర్దారించుకోకుండా పోస్ట్ చేయవద్దని సిపి ఈ సందర్బంగా సూచించారు.