ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టుల సంఘీభావం
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, అక్టోబర్ 11: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించేందుకు టీయూడబ్ల్యూజే (ఐజెయు) కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రెస్ భవన్ నుంచి ఆర్టీసీ బస్ స్టేషన్ వరకు వెళ్ళిన జర్నలిస్టులకు ఆర్టీసీ జేఏసీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం సమ్మె వేదికపై టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్, జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, కె.చంద్రశేఖర్ కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జానంపేట మారుతీ స్వామి, కోశాధికారి శరత్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బల్మూరి విజయసింహా రావు, ఉపాధ్యక్షుడు గజవాడ ఆంజనేయులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి నర్సింగోజు మహేంద్ర చారి, సహయ కార్యదర్శి ఎండి షుకూర్, జర్నలిస్టులు దాడి సంపత్, జగన్ మోహన్, అసద్, ఇమామ్, మోసిన్, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొత్త సత్యనారాయణ, జి.రాజయ్య, నిజాముద్దీన్, ఫోటో గ్రాఫర్లు కిరణ్, జనార్ధన్, సంతోష్, రాధాకృష్ణలతోపాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.