JMS News Today

For Complete News

బంగారు దుకాణాలే టార్గెట్…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

నిజామాబాద్, జులై 1: నిజామాబాద్ పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. కేవలం బంగారు దుకాణాలను టార్గెట్ చేసుకుని దోపిడీకి పాల్పడ్డారు. వినాయక్ నగర్ ప్రాంతంలో మూడు బంగారు దుకాణాల్లో చొరబడ్డ దొంగలు అందినకాడికి దోచుకెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతం లో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సిసి కెమెరా కేబుల్స్ కట్ చేసి షెట్టర్ తాళాలు పగులకొట్టి బంగారు దుకాణాల్లో చొరబడ్డారు. నగరంలోని సాయి తేజ, శ్రీ సాయిమహా లక్ష్మీ, చరణ్ తేజ్ బంగారు దుకాణాల్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఓ దుకాణం లో చోరీ చేస్తుండగా దుండగులు సిసి కెమెరాకు చిక్కారు. వరుస చోరీల తో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *