కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి బెదిరింపు కాల్స్…
1 min read
హైదరాబాద్: తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి . కిషన్‌రెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 20న కొందరు అజ్ఞాతవ్యక్తులు ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా తనకు ఫోన్ చేశారని, చంపుతామని బెదిరించారని కిషన్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిషన్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టారు.