JMS News Today

For Complete News

మూడు నదుల సంగమాన… ఆ ముగ్గురు

1 min read

కరీంనగర్ : త్రివేణి సంగమాన నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి శుక్రవారం ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ముందుగా యాగంలో పాల్గొన్న ముగ్గురు ముఖ్యమంత్రులు… ఆ తరువాత ప్రాజెక్టు ను ప్రారంభించి తెలంగాణ జాతికి అంకితం చేశారు. తొలి సారిగా ఇరుగుపొరుగు ముఖ్యమంత్రులు.. అందులో అటవీ ప్రాంతమైన త్రివేణి సంగమాన..ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్టు వద్ద కలసి తిరగడం అందరినీ ఆకర్షించింది. ముగ్గురు ముఖ్యమంత్రులతో రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పాల్గొనడం కూడా జోష్ నింపింది. ప్రారంభానికి హాజరైన పొరుగు రాష్ట్రాల సీఎంలకు మంత్రులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మొత్తానికి భక్తులతో కనిపించే కాళేశ్వరం పరిసరాలు ఇవాళ ప్రముఖులతో సందడి మారగా, ముగ్గురు సీఎంలు పోలీసు తుపాకీ నీడన పర్యటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *