మూడ్రోజులు మీ-సేవలు బంద్
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, డిసెంబర్ 12: మీ-సేవా డేటాబేస్ కార్యకలాపాలను మెరుగుపర్చనున్న కారణంగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు అంటే ఈనెల 16వ తేదీ వరకు బంద్ చేయనున్నట్టు మీ-సేవా కమిషనర్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 7గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకు మీ-సేవా కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు చెప్పారు. తిరిగి ఈనెల 16వ తేదీ ఉదయం 8గంటల నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.