ముగ్గురిని మింగేసిన కాలువ
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
నిజామాబాద్, జూలై 6: ఓ నీటి కాలువ ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను మింగేసింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ నగర శివారు చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నాగారం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నమాజ్ కోసం శుక్రవారం మధ్యాహ్నం బయటకు వచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వ క్రీడా మైదానం పక్కనే ఉన్న నీటి కాలువలో ప్రమాదవశాత్తు పడి చనిపోయి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతుల్లో ఒకరు మూడో తరగతి విద్యార్థికాగా, మరో ఇద్దరు నాల్గోతరగతి విద్యార్థులు. పాఠశాల నుంచి బయటకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రాకపోవడంతో ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారంతా సాయంత్రం వరకు వెతికినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో ఐదో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం కాస్తా చీకటి పడిన తర్వాత కాల్వలో ఓ విద్యార్థి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మరో రెండు మృతదేహాలు శనివారం ఉదయం బయటపడ్డాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, మృతుల కుటంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.