పిడుగుపాటుతో ఒకరి మృతి….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
బోయినపల్లి, సెప్టెంబర్ 24: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురువగా, బోయినపల్లి మండలంలోని నీలోజిపల్లి గ్రామంలో పిడుగు పాటుతో కుసుంబ లక్ష్మణ్ (48) అనే వ్యక్తి మృతి చెందాడు. సాయంత్రం పూట చేను వద్ద కూరగాయలు తెంపటానికి పొలం వద్దకు వెళ్లగా, పిడుగుపాటు సంభవించి లక్ష్మణ్ మృతి చెందాడు. ఈ ఘటన మృతుడి కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా, కరీంనగర్ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వచ్చాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.