పుర పోరుపై తెరాస నజర్… నేడు కార్యవర్గ భేటీ
1 min read
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం జరగనుంది. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించిన తెరాస ఇక పుర పోరుపై నజర్ వేసింది. నిన్న జరిగిన మంత్రివర్గ భేటీలో జులై నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జరుగుతున్న ఈ సమావేశంలో గులాబీ బాస్, సీఏం కేసీఆర్ పార్టీ శ్రేణులను దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, జిల్లా స్థాయిలో పార్టీ కార్యాలయాలు నిర్మాణం తదితర అంశాలపై వివరించనున్నారు.