స్విట్జర్లాండ్‌లో మన్మధుడు….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
స్విట్జర్లాండ్‌లో టాలీవుడ్ మన్మధుడు నాగ్ దంపతులు (నాగార్జున-అమల ) ఎంజాయ్ చేస్తున్నారు. మన్మథుడు 2 షూటింగ్లో భాగంగా నాగ్ స్విట్జర్లాండ్‌కి వెళ్లగా, ఆయన సతీమణి అమల కూడా ఆయన వెంట వెళ్ళారు. మంచు కొండల్లో ఈ జంట ఫోటోలకి ఫోజులిస్తూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తోంది. అమల తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్విట్జర్లాండ్ లొకేషన్లో దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో మన్మథుడు 2 హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. రావు రమేశ్, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్, దేవదర్శిణి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. మనం ఎంటర్‌ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయ్‌కామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా మన్మథుడు 2 చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగార్జున స్వయంగా జెమిని కిరణ్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా పని చేస్తున్నారు. ఫన్ రైడ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తైనట్టు తెలుస్తుంది. చాలా కాలం తర్వాత నాగార్జున ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్తో అలరించనున్నాడు. ఆగస్ట్ 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.