JMS News Today

For Complete News

తండ్రి బాటలోనే…తనయుడు

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

అమరావతి, జూన్ 30: తండ్రి బాటలోనే తనయుడు ఆడు గులేస్తున్నారు.  ఇక నిత్యం గంట పాటు జనం మధ్య ఉండనున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం సహా సత్వర పరిష్కారంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. దీనికోసం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ను నిర్వహించాలని నిర్ణయించారు. రోజూ ఉదయం గంటపాటు సామాన్య ప్రజలను కలిసి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. వ్యక్తిగత సమస్యలు, తమ ప్రాంత సమస్యలను పరిష్కరించాలని సామాన్య ప్రజలు సైతం వినతి పత్రాలతో వస్తున్నారు. వచ్చిన వారందరి నుంచీ నెలరోజులుగా ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు వినతులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రజాదర్బార్ ప్రారంభించేందుకు జులై 1న మహూర్తంగా నిర్ణయించారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. ప్రజాదర్బార్ తరువాతే రోజువారీ అధికారిక కార్యక్రమాలు, శాఖాపరమైన సమీక్షల్లో పాల్గొంటారని అధికారిక వర్గాలు తెలిపాయి. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు… హైదరాబాద్ బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ను ప్రారంభించి కొనసాగించిన విషయం తెలిసిందే. ఆయన మార్గంలోనే ప్రజా దర్బార్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ నిర్ణయించి అమలు చేస్తుండడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *