కౌన్ బనేగా…కరీంనగర్ పీఠం
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జనవరి 26: కరీంనగర్ కార్పోరేషన్ ఏవరి పరం కానుందో మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. డివిజన్లలో పోటీ చేసిన వారిలో ఏవరు అదృష్టవంతులో కూడా లెక్క తేలనుంది. బ్యాలెట్ బాక్సులలో ఓటరు దేవుళ్ళు నిక్షిప్తం చేసిన నేతల భవితవ్యం వెలుగు చూడనున్న దరిమిలా అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉండగా, అందులో రెండు డివిజన్లు ఏకగ్రీవం కాగా, మిగిలిన 58 డివిజన్లలో బరిలో నిలిచిన 369 మంది అభ్యర్థులు ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 58 డివిజన్లో కలిపి మొత్తం పోలింగ్ 62.52 శాతం నమోదైంది.
మొత్తం 2,64,134 ఓటర్లు ఉండగా, మొత్తం 1,65,147 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 7గంటలకు నుంచి ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మొత్తం 3 రౌండ్ల లో ఓట్ల లెక్కిపు జరగనుండగా, కౌంటింగ్ ప్రక్రియకు మొత్తం 58 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 58 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, ఒకరికి ఇద్దరు అసిస్టెంట్లు, 20 మంది మైక్రో అబ్జర్వర్లు నియమించారు. ఈ కౌంటింగ్ ప్రక్రియలో మొదటగా డివిజన్ ల వారీగా పోస్టల్ బ్యాలెట్ల్ ను లెక్కిస్తారు. నగరపాలక సంస్థ మొత్తం 500లకు పైగా పోస్టల్ బ్యాలెట్స్ ను ఇష్యూ చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఓట్ల లెక్కింపు జరగనుంది. డివిజన్ల వారిగా ఓట్లను లెక్కిస్తారు. 25 ఓట్ల ఒక కట్ట కట్టి, రౌండుకు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ సీసీ కెమెరాలో రికార్డ్ చేయనున్నారు. కౌంటింగ్ కు పోటీ చేసిన అభ్యర్థిని, వారి తరుపున ఏజెంట్ గానీ ఒక్కరినే కౌంటింగ్ హాల్ లోకి అనుమతించనున్నారు. కౌంటింగ్ వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ లోకి సెల్ ఫోన్స్, అగ్గిపెట్టెలు, మారణాయుధాలు లాంటివి హాల్ లోకి తీసుకురావద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా, జిల్లాలోని జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికలు నిర్వహించనున్నారు. గెలుపు ఇచ్చిన ధీమాతో టీఆర్ఎస్ నాయకులు చైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికలపై దృష్టి సారించారు. ఇప్పటికే గెలిచిన విజేతలను క్యాంపులకు తరలించారు. మొత్తానికి నాలుగు మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనుండగా, కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు.