ఏమైనా ఇబ్బందులోస్తే వెంటనే…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఫిబ్రవరి 28: కరీంనగర్ సీపీ సత్యనారాయణ అదేశాల మేరకు కరీంనగర్ శాతవాహన కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం షీ టీమ్ పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ టౌన్ ఏసిపి తుల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, బయటే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఏదైనా ఇబ్బందులకు గురైనపుడు వెంటనే పోలీసులని సంప్రదించాలని, షీ టీం సేవలను వినియోగించుకోవాలని సూచించారు. షీ టీం ఇన్చార్జ్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ షీ టీంని ఎలా సంప్రదించాలో వివరించారు. ఆపద వచ్చినపుడు షీ టీంని సంప్రదించడం వల్ల ఎలాంటి సహాయం అందుతుందో విద్యార్థులకు వివరించారు. ఈ అవగాహన సదస్సులో డయల్ 100 ప్రాముఖ్యతను, హ్యాక్ ఐ యాప్ పని తీరుని, క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ వన్ టౌన్ సిఐ నటేష్, షీ టీమ్ ఏఎస్ఐ విజయమణి, సుమారు 200 మంది విద్యార్ధినులు పాల్గొన్నారు.