JMS News Today

For Complete News

బోల్తా బస్సు: పెళ్లి వేడుకల్లో విషాదం.

1 min read

పశ్చిమ గోదావరి జిల్లా : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం గురువాయి గూడెం సమీపంలో ఆదివారం పెళ్లి బస్సు బోల్తా పడి ఇరవై మందికి పైగా గాయపడ్డారు. పెళ్లి సందర్భంగా బంధుమిత్రులంతా కలిసి బస్సు ఎక్కారు. అయితే ఆ బస్సు కొద్ది దూరం వెళ్లాక అదపుతప్పి ప్రమాదానికి గురై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 25 మంది గాయపడ్డారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇందులో పలువురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని.. ఏలూరు ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *