సాయినగర్‌లో విషాదం: భవనంపై నుంచి పడి విద్యార్థిని మృతి
1 min read
హైదరాబాద్: హైదరాబాద్ లోని నాగోల్ సాయినగర్‌లో గురువారం విషాదం నెలకొంది. ఓ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న వినీత అనే విద్యార్థిని స్కూల్ భవనం 4వ అంతస్తు నుంచి పడి మృతి చెందింది. పాఠశాలలు ప్రారంభమైన రెండో రోజే ఈ సంఘటన చోటు చేసుకోవడం విచారకరం.