ట్రస్మా నూతన కార్యవర్గాల ఎన్నిక
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 10: కరీంనగర్ లోని శ్రీరామ గార్డెన్స్ లో శనివారం నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశం అనంతరం ట్రస్మా కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కోరెం సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దాసరి శ్రీ పాల్ రెడ్డి, కోశాధికారిగా గాజుల తిరుపతి
ఎన్నికయ్యారు. అలాగే పట్టణ నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షులుగా చింతపెల్లి శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శిగా రాహుల నరేష్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా సందబోయిన ముత్తయ్య, కోశాధికారిగా బొమ్మ శ్రీనివాస్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్ రావు నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు, ఎన్నికలకు సహకరించిన కరస్పాండెంట్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి ట్రస్మా ప్రయత్నం చేస్తూనే ఉందని, అన్ని సమస్యలు పరిష్కరించి ప్రైవేటు పాఠశాలలకు పునర్వైభవం తీసుకురావడానికి ట్రస్మా కట్టుబడి ఉన్నదని పునరుద్గటించారు.