నేడు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం
1 min read
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో ఈ నెల 17 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో తెరాస ఎంపీలు వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే ఈ సమావేశంలోనే పార్లమెంటరీ పార్టీ నేతను కేసీఆర్ ప్రకటించనున్నారు.