పండుగలా…సభ్యత్వం
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 5: తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా తెరాస పార్టీ ఉంటుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం నగరంలో ని 1వ డివిజన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కరీంనగర్ నియోజకవర్గంలో తెరాస పార్టీ సభ్యత్వాలు ఒక పండుగలా జరుగుతున్నాయని , అన్ని వర్గాల ప్రజలు పోటీపడి సభ్యత్వాలు తీసుకుంటున్నారని అన్నారు. పార్టీ నిర్దేశించిన 50 వేల సభ్యత్వం కంటే కరీంనగర్ పట్టణంలో అత్యధికంగా సభ్యత్వాలు చేపడతామని అన్నారు. ఈ నెల 10వ తేదీలోపు పార్టీ ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అన్నారు. సభ్యత్వ నమోదు తీరును చూస్తే నియోజకవర్గంలో మరిన్ని పుస్తకాలు అవసరం అయ్యేలా ఉన్నాయని అన్నారు. బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళలు, రైతులు పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని అన్నారు.
పార్టీ సభ్యత్వం తీసుకున్న మహిళలు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కి ప్రత్యామ్నాయం లేదని, టిఆర్ఎస్ పార్టీ తమ ఇంటి పార్టీ అని తెలంగాణ ప్రజలంతా భావించి సభ్యత్వం లో ఉత్సాహంగా తీసుకుంటున్నారని అన్నారు. టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు రాబోయే ఎన్నికలకు దిక్సూచి కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లో మాజీ కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ , సునీల్ రావు , చల్లా హరీష్ శంకర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
.