మాకు ఎదురులేదు…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 4: కరీంనగర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ కి ఎదురులేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థానాలను ఎలాగైతే కైవసం చేసుకున్నమో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా అలాగే పూర్తి స్థానాలను కైవసం చేసుకుని విజయఢంకా మోగిస్తామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సభ్యత్వ నమోదు లో భాగంగా గురువారం నగరంలోని 5 వ డివిజన్ కిసాన్ నగర్ లో ఆ డివిజన్ మాజీ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గంలో 20 వేల క్రియాశీలక, 30 వేలు సాధారణ సభ్యత్వాలు ఈ నెల 10లోగా పూర్తి చేస్తామని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం అదృష్టంగా, గర్వ కారణంగా భావిస్తున్నారని, అందుకే టిఆర్ఎస్ సభ్యత్వాన్ని తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అని, అభివృద్ధి చేసే పార్టీ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తొలి సభ్యత్వాన్ని కంసాల శ్రీనివాస్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పలువురు నేతలు పాల్గొన్నారు.