టీఆర్ఎస్ లో మరో సంబరానికి వేళాయనే….
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే)
కరీంనగర్, జూన్ 22: టీఆర్ఎస్ మరో సంబరానికి ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కాళేశ్వరం సంబరాలు ఘనంగా నిర్వహించుకున్న ఆ పార్టీ శ్రేణులు సోమవారం మరో సంబరానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాల నిర్మాణాల కోసం భూమి పూజ (శంకుస్థాపన) చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఏ జిల్లాలో ఎవరూ భూమి పూజ చేయాలనేది కూడా నిర్ణయించింది. తొమ్మిది జిల్లాలలో మంత్రులు, మిగతా జిల్లాలలో జడ్పీ చైర్మన లు శంకుస్థాపన లు చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కు సంబంధించి కరీంనగర్ లో మంత్రి ఈటెల రాజేందర్, జగిత్యాల లో మంత్రి కొప్పుల ఈశ్వర్, సిరిసిల్ల లో జడ్పీ చైర్ పర్సన్ అరుణ, పెద్దపల్లి లో జడ్పీ చైర్మన్ పుట్ట మధు లు భూమి పూజ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందరికీ సమాచారం అందించారు. దీంతో అందుకు సమాయత్తమవుతున్నారు.