JMS News Today

For Complete News

దసరా నాటికి పూర్తి

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 24: రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కృషి చేస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం కరీంనగర్ శివారు చింతకుంట గ్రామంలోని గాంధీ నగర్ వద్ద పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యేేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిిిషన్ లతో కలసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రాజేందర్ మాట్లాడుతూ రేపటి నుండి జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కూడా బలోపేతం చేయాలనే సంకల్పంతో అన్ని జిల్లా కేంద్రాలలో పార్టీ కార్యాలయ నిర్మాణాలను చేపడుతున్నట్టు పేర్కొన్నారు. వాస్తు పండితులు సుద్దాల సుధాకర్ తేజ సూచనల మేరకు రేపు పనులు ప్రారంభిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. పార్టీ నిర్మాణ పనులను దసరా లోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో  జడ్పీ చైర్ పర్సన్ విజయ, సూడా చైర్మన్ జీవి రామకృష్ణా రావు , మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ , మాజీ ఎమ్మెల్సీ టి సంతోష్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ ,నాయకులు పిట్టల రవీందర్, వై.సునీల్ రావు చల్లా హరీశంకర్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *