JMS News Today

For Complete News

టిఆర్ఎస్ లో సంస్థాగత సందడి…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, జూన్ 25: ఈ నెల 27న మధ్యాహ్నం 2.30 గంటలకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరుగనుంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను , రాజ్యసభ, లోకసభ సభ్యులతో కూడిన టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన టిఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని , రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లను , జిల్లా పరిషత్ చైర్ పర్సన్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు . పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు , పార్టీ సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలు అందచేస్తారు . తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసే 11 ప్రత్యేక కౌంటర్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు , మంత్రులు , ఎంపీలు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు అదే రోజు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *