అలా చేయాలని రాజ్యాంగంలో ఉందా…?
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 9: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ను హైదరాబాద్ లోని తన ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక శాతవాహన యూనివర్సిటీ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీందర్ మాట్లాడుతూ నిజామాబాద్ లో జరిగే సన్మాన సభకు వెళుతుంటే గృహ నిర్బంధం చేశారని, రాష్టంలో ఆదివాసీలు సన్మానం చేయించుకునే హక్కు కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హరితహారం పేరు మీద ఆదివాసీలు పోడు చేసుకున్న భూములలో చెట్లు నాటి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల మీద కక్షతో అక్రమ అరెస్టులు చేయిస్తుందని విమర్శించారు. పార్లమెంట్ సభ్యులను అక్రమ అరెస్టులు చేయడం రాజ్యాంగంలో ఉన్నాదా అని ప్రశ్నించారు. ఇకముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని రవీందర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు హలం చెందు, రాజయ్య, శ్రీనివాస్, వెంకటేష్ తోపాటు పలువురు విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.