JMS News Today

For Complete News

దేవుడే అడ్డొచ్చినా….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

సత్తుపల్లి, సెప్టెంబర్ 4: రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజెయు) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రాంతీయ సదస్సు డిమాండ్ చేసింది. బుధవారం సత్తుపల్లిలో జరిగిన టీయూడబ్ల్యూజే ప్రాంతీయ సదస్సులో పలు తీర్మానాలను ఆమోదించారు . 239 జీవోను రద్దు చేసి అందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలి. ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, ఆరు నెలలు పూర్తి చేసుకున్న మీడియా సంస్థలకు ఎంప్యానల్ మెంటు కు సంబంధం లేకుండా అక్రిడిటేషన్ కార్డులు అందించాలని, గతంలో శాసనసభ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపర్చిన టిఆర్ఎస్ హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ప్రాంతీయ సదస్సు డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , టియుడబ్ల్యూజే రాష్ట్ర సలహాదారు కే.శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.రామ్ నారాయణ అధ్యక్షత వహించారు . ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు , ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు కే అమర్నాథ్, ఐజేయూ కార్యవర్గ సభ్యులు కే. సత్యనారాయణ, దాసరి కృష్ణారెడ్డి, టియుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్, కార్యదర్శి గాడేపల్లి మధు, జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిలు రమేష్ , యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రాజేష్ , హెచ్ యుజె కార్యదర్శి శంకర్ గౌడ్, ఖమ్మం జిల్లా శాఖ అధ్యక్షులు వెంకట్రావు, కార్యదర్శి ఖాదర్ అలీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు వెంకట రమణారెడ్డి, కార్యదర్శి జె.రమేష్, కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, కార్యదర్శి మారుతి స్వామి, యూనియన్ నాయకులు ఏనుగు వెంకటేశ్వరరావు , బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం సలహాదారు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సమస్యల పరిష్కారంలో ఆ దేవుడే అడ్డొచ్చినా ఆగేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంఘాల్లో ఎవరికి మెజార్టీ ఉందో తేల్చడానికి ప్రభుత్వం సింగరేణిలో మాదిరిగా ఎన్నికలు నిర్వహించి గుర్తింపు సంఘానికి ప్రెస్ అకాడమీ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల సాధనలో రాజీలేని పోరాటాలు చేస్తుందని చెప్పారు. ఖమ్మం ఎంపీ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టు ల సమస్యల పరిష్కారం కోసం తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *