మనోజ్ కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 11: కరోనా మహమ్మారికి బలైన హైదరాబాద్ టీవీ 5 రిపోర్టర్ కామ్రేడ్ మనోజ్ కుమార్ కు టీయూడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా శాఖ ఘనంగా నివాళులర్పించింది. గురువారం స్థానిక ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సంతాప కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే నేతలు, జర్నలిస్టులు మనోజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, జానంపేట మారుతీ స్వామి మాట్లాడుతూ మనోజ్ కుమార్ అకాల మరణం తీవ్ర దిగ్ర్భాంతి కి గురిచేసిందన్నారు. మనోజ్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు కరోనా మహమ్మారి బారిన పడకుండా అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని, విధుల్లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు రూ.50లక్షల భీమా సౌకర్యాన్ని కల్పించాలని, అలాగే మనోజ్ కుమార్ కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి శరత్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయసింహా రావు, నాయకులు నర్సింగోజు మహేంద్ర చారి, ఆసద్, సంబోజి శేఖర్, జర్నలిస్టులు రాజయ్య, ప్రభుదాస్, వెంకటేశ్వర స్వామి, గంగం రాజు, మహేందర్, శ్రీనివాస్ లతోపాటు పలువురు పాల్గొన్నారు.